హైదరాబాద్ లో బస్ స్టాప్ నుంచి ప్రయాణికులను క్షణం వృథా చేయకుండా తీసుకెళ్లే క్యాబ్ లు బంద్ అయ్యాయి. నగరంలో దాదాపు 70 వేల క్యాబ్ లు నిలిచిపోయాయి. కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థల నుంచి ఇబ్బందులు తలెత్తడంతో క్యాబ్ లను బంద్ చేసి నిరసన తెలుపుతున్నారు. ఈ తరుణంలో ఆటోవాలాలు దోపిడీకి మళ్లీ తెర లేపారు. నోటికి ఎంత వస్తే అంత కిరాయి అడిగి దోచుకుంటున్నారు. దీంతో ఆటోలవైపు చూడాలంటేనే ప్రయాణికులు భయపడుతున్నారు.

క్యాబ్ ల బంద్, ఆటోల దోపిడీతో ప్రయాణికులకు ఆర్టీసీ బస్సులే దిక్కయ్యాయి. కానీ అధికారులు మాత్రం ఒక్క బస్సు కూడా అదనంగా నడపడం లేదు. క్యాబ్ ల బంద్ విషయం ముందే తెలిసినా.. ప్రయాణికుల అవసరాలు తీర్చేందుకు తీసుకున్న చర్యలు శూన్యం. కనీసం రేపటి నుంచైనా అదనపు బస్సులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. జనం రోడ్డెక్కి అవస్థలు పడిన తర్వాత కళ్లు తెరవడం కంటే.. ముందే సరైన ప్రణాళికతో బస్సులు నడిపితే.. కష్టాలు కొంతైనా తీరతాయి.

LEAVE A REPLY