తెలంగాణ అసెంబ్లీ రణరంగాన్ని తలపిస్తోంది. ఫీజు రీయింబర్స్ మెంట్ పై చర్చ సందర్భంగా సభలో గొడవ జరిగింది. దీంతో స్పీకర్ అసెంబ్లీని రేపటికి వాయిదా వేశారు. అయితే చర్చలో తమకు మాట్లాడేందు అవకాశమివ్వలేదంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు సభ వాయిదా పడినా.. లోపలే కూర్చొని ఆందోళన చేపట్టారు. మధ్యాహ్నం నుంచి ఆందోళన కొనసాగించారు. దీంతో ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు. అసెంబ్లీలో బైఠాయించిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బయటకు తరలించారు.  అంతకు ముందు ఆందోళన విరమించాలని అసెంబ్లీ కార్యదర్శి విజ్ఞప్తి చేసినా ప్రతిపక్ష నేతలు పట్టించుకోలేదు. దీంతో స్పీకర్ ఆదేశాలతో పోలీసులు ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గాంధీ భవన్ కు, టీడీపీ ఎమ్మెల్యేలను ఎన్టీఆర్ భవన్ కు తరలించారు.

LEAVE A REPLY