తెలంగాణలో ఎంసెట్ లీకేజ్ వ్యవహారం ఎంత సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే. కేసులో చాలామందిని అరెస్టు చేసినా.. సీఐడీ ఎంత పురోగతి సాధించిందనేదానిపై ఎవరికీ క్లారిటీ లేదు. తాజాగా ఇప్పుడు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కమిలేశ్వర్ అనుమానాస్పద మృతి కారణంగా కేసు ముందుకు సాగంపై నీలినీడలు కమ్ముకున్నాయి. కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కమిలేశ్వర్ ను నాలుగు రోజుల క్రితం పట్నాలో అదుపులోకి తీసుకుంది. జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా కమిలేశ్వర్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స కోసం ఉస్మానా ఆస్పత్రికి తరలించారు.  అక్కడ చికిత్స పొందుతూ గుండెపోటుతో కమిలేశ్వర్ మృతి చెందాడు. విషయం వెంటనే బయటకు పొక్కకుండా ఉస్మానియాలో పోస్టుమార్టం కూడా పూర్తి చేశారు. నాలుగు రాష్ట్రాల్లో పలు ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న కమిలేశ్వర్ హఠాత్తుగా మరణించడంతో కేసు విచారణ ముందుకు సాగడం కష్టమేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

LEAVE A REPLY