తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం అవసరమైన భూములను జీవో 123 ద్వారా సేకరించరాదని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మల్లన్నసాగర్, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తదిరత ప్రాజెక్టులకు అవసరమైన భూములను 2013 కొత్త భూసేకణ చట్టం కింద కాకుండా జీవో 123 ద్వారా భూసేకరణ చేస్తుండడాన్ని సవాల్ చేస్తూ మెదక్, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాల రైతులు, కూలీలు, చేతివృత్తుల వాళ్లు వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై దాఖలైన పిటిషన్లను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపి.. గత ఏడాది నవంబర్ 24న ఉత్తర్వులపై నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. జీవో 123 పేరుతో అధికారులు తమ భూములను బలవంతంగా లాక్కుంటూ.. తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకుంటున్నారని రైతులు హైకోర్టుకు నివేదించారు. చట్టాన్ని కాదని ప్రభుత్వం భూములు తీసుకుంటోందని తెలిపారు.దీనిపై స్పందించిన హైకోర్టు జీవో 123 ద్వారా భూ సేకరణ జరపొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది

LEAVE A REPLY