నమో వెంకటేశా అంటూ మొక్కితే కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం మన తిరుమలేశుడు. అదే సమయంలో భక్తుల కానుకల ద్వారా కొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. భక్తుల రద్దలో రికార్డులు లేకపోయినా.. శ్రీవారి కానుకలు మాత్రం రికార్డుల మొత మోగిస్తున్నాయి. ఒక్క ఏడాదిలో ఎన్నడూ లేని విధంగా శ్రీవారి హుండా ఆదాయం వెయ్యి కోట్లు దాటి పోయింది. 2016 కేవలం హుండీ ద్వారా శ్రీవారి సంపాదన రూ.1019 కోట్లు. ఇక షాపుల అద్దెలు, తలనీలాలు.. వంటి వాటితో అదనంగా మరో 400 కోట్లకు పైగా శ్రీవారికి చేరాయి.  ఇందులో గత రెండు నెలల్లో శ్రీవారి హుండీలో పడిన రద్దైన నోట్లను లెక్కించలేదు. అవి కూడా జమ చేసుకుంటే శ్రీవారి సంపాదన అమాంతం పెరిగిపోతుంది. ఈ నోట్లను డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పించాలని రిజర్వ్ బ్యాంకుకు టీటీడీ అధికారులు లేఖ రాశారు. దీనిపై సానుకూల స్పందన వస్తుందని భావిస్తున్నారు.

శ్రీవారి హుండీ రికార్డులు పరిశీలిస్తే దేవుడిపై భక్తి కంటే దాచుకోవడం కుదరక పంచి పెట్టేసినట్టు కనిపిస్తోంది. నోట్ల రద్దుతో పెద్ద నోట్లు ఏం చేయాలో తెలియక.. దగ్గర పెట్టుకోలేక.. చాలామంది వాటిని దువడి హుండీలో వేసేశారు. అందుకే ఒక్క డిసెంబర్ నెలలోనే హుండీ ఆదాయం ఏకంగా 85 కోట్లు వచ్చింది.

LEAVE A REPLY