మెగాఫ్యాన్స్ కు ఒక తీపి కబురు. 150వ సినిమా కోసం ఫ్యాన్స్ చేసిన మొక్కులు తీరినట్టే కనిపిస్తున్నాయి. సెన్సార్ గేటు దాటేసి.. థియేటర్లను తాకడానికి ఈ సినిమా సిద్ధంగా ఉంది. సెన్సార్ దగ్గర వచ్చిన ఫీడ్ బ్యాక్ తెలిస్తే.. సగటు మెగా అభిమాని ఎగిరి గంతేయక మానడు. సాధారణంగా ఏ సినిమా అయినా సెన్సార్ చేయాలంటే నాలుగైదు షోలు వేయాల్సి ఉంటుంది. సెన్సార్ బోర్డు సభ్యులు వీలును బట్టి విడతల వారీగా సినిమా చూసి తమ అభిప్రాయాలు నోట్ చేస్తారు. ఇది ప్రతి సినిమా విషయంలోనూ మామూలే. కానీ మచ్ ఎవైటెడ్ మెగాస్టార్ మూవీ విషయంలో సెన్సార్ బోర్డ్ ఒక్కటైపోయింది. సభ్యులందరూ ఒకేసారి అసినిమా చూసి తమ అభిప్రాయం చెప్పేశారు. దీంతో ఖైదీ నంబర్ యూఏ సర్టిఫికెట్ వచ్చేసింది. బోర్డు సభ్యులందరికీ సినిమా తెగ నచ్చేసింది. తమిళ సినిమా కంటే తెలుగులో ట్విస్టులు ఎక్కువగా ఉన్నాయి. కథకు తగ్గట్టుగా పాత్ర మదింపు జరిగిందని ఏకాభాప్రాయం వ్యక్తం చేశారు. చిరంజీవి యాక్టింగ్ టాలెంట్ ను పదేళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై చూడదగిన అన్ని రసాలు ఇందులో ఉన్నాయని సర్టిఫికెట్ ఇచ్చేశారు. ఇక సినిమా సగం హిట్టైనట్టేనని మెగా టీమ్ ఖుషీగా ఉంది.

LEAVE A REPLY