తిరుమలలో శ్రీవారి దర్శనం కావాలంటే డబ్బున్న వాళ్లకే సాధ్యమా..? అంటే అవుననే అనిపిస్తోంది ఇటీవలి పరిణామాలు చూస్తుంటే. రోజుకోసారి నిబంధనలు మారుస్తూ.. టీటీడీ భక్తులకు దేవుడ్ని దూరం చేస్తోంది. పైగా వారి సౌకర్యం కోసమేనంటూ చెప్పుకొస్తోంది. ఇన్నాళ్లూ జనం నుంచి వినిపించిన ఈ మాటలు.. ఇప్పుడు సెలబ్రిటీల నుంచి కూడా వినిపిస్తోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మోహన్ బాబు.. తర్వాత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం డబ్బున్న వారికే శ్రీవారి దర్శనం లభిస్తోందని మండిపడ్డారు. ఎన్టీఆర్ హయాంలో ఉన్నంతగా ఇప్పుడు పరిపాలన సాఫీగా సాగడం లేదన్నారు. గుడిలో ఒక్కోసారి ఒక్కో నిబంధన పెడుతున్నారని వ్యాఖ్యానించారు. అధికారి మారినప్పుడల్లా వారికి ఇష్టం వచ్చినట్టు మార్పులు చేస్తున్నారు. అవి భక్తులకు మేలు చేసేవైతే పర్వాలేదు.. కానీ అలా జరగడం లేదు.. ఇవాళ నేను చాలా బాధపడ్డానని చెప్పారు. ధ్వజస్థంభాన్ని కొందరినే తాకనిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

LEAVE A REPLY