1సినిమాలు.. రాజకీయాలు.. రెండూ వేర్వేరు దారులు. పొలిటికల్ లీడర్స్ అనగానే ఒకరిపై ఒకరి విమర్శలు, మాటల బాణాలు, సినిమా వాళ్లనగానే రంగుల కలలు. మరి ఈ రెండూ ఒకే చోట కలిస్తే.. ఖైదీ నంబర్ 150 రిలీజ్ నేపథ్యంలో అదే జరిగింది. వెండితెర ప్రేమికులు, రాజకీయ రంగ శత్రువులు కలిశారు. ఏంటీ అర్థం కాలేదా..? ఖైదీ నంబర్ 150 ఈ నెల 11న రిలీజ్ కాబోతోంది. మూవీ ప్రమోషన్ లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి అన్ని న్యూస్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అదే సమయంలో అందరికంటే భిన్నంగా ఓ వెబ్ ఛానల్.. వారి ప్రతినిధితో కాకుండా.. జబర్దస్త్ భామ రోజాతో ఇంటర్వ్యూ చేయించింది. అదే ఇప్పుడు సంచలనానికి వేదికైంది. రాజకీయాల్లో ఎప్పుడూ విమర్శలతో కొట్టుకునే మెగాస్టార్, రోజా.. వెండితెరపై మాత్రం ప్రేమికులు. ఇంకేముంది. ఓ వైపు ఫన్.. మరో వైపు గన్.. ఇలా సాగింది ఇంటర్వ్యూ. మొత్తానికి ఖైదీ పుణ్యమా అంటూ రోజా, మెగాస్టార్ జంటను మరోసారి అభిమానులు చూశారన్నమాట.

LEAVE A REPLY