నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగర నిర్మాణంలో మరో ముందడుగు పడింది. మౌలిక సదుపాయాల కల్పనలో  డిజిటల్ సహకారం అందించేందుకు సింగపూర్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ముందుకొచ్చింది. రోడ్లు, భవనాల నిర్మాణం, మురుగు కాల్పలు, కేబుల్ వ్యవస్థ వంటి కీలక మౌలిక సదుపాయాలను డిజిటలైజ్ చేస్తూ లేటెస్ట్ టెక్నాలజీని అందించనుంది.  ప్రణాళికను మొదట సీఆర్డీఏకు అందించనున్నారు. తర్వాత దశల వారీగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు అందిస్తారు. ఈ మేరకు  సింగపూర్ తో సీఆర్డీఏ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సింగపూర్ ప్రతినిధి తిమోతీసన్, సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ లు.. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఒప్పందంపై సంతకాలు చేశారు.  నగరాల అభివృద్ధిలో డిజిటల్ ప్రణాళిక ఎంతో ఉపయోగమన్నారు. డిజిటల్ సర్వేకయ్యే ఖర్చును సింగపూర్, ఆంధ్ర సమానంగా భరించాల్సి ఉంటుందన్నారు.

LEAVE A REPLY