VIJAYAWADA, ANDHRA PRADESH, 10/01/2015: Pandit Nehru Bus Station in Vijayawada witnessing heavy rush as holidays for the Sankranti festival begins from Saturday. Photo: Ch.Vijaya Bhaskar

సంక్రాంతి వచ్చేసింది. పట్టణాలు కదులుతున్నాయి. పల్లెటూళ్లకు బయల్దేరాయి. ఉరుకుల పరుగుల జీవితానికి కాస్త విరామమిచ్చి.. బాలస్మృతులు, బంధువులతో సందడి కోసం చిన్నా పెద్దా అందరూ సొంతూళ్లకు కదిలారు. దీంతో ఆర్టీసీలో పండగ వాతావరణం మొదలైంది. ఓ వైపు ప్రైవేట్ దోపిడీ మాత్రం రెండింతలు పెరిగింది. బస్సుల్లో ఛార్జీలు అమాంతం పెంచేసిన ప్రైవేట్ ఆపరేటర్లు.. నిలువుదోపిడీ చేస్తున్నారు. ఇక పండుగ రద్దీ పెరుగుతుండడంతో.. ఆర్టీసీ కూడా ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఆదాయపరంగా కూడా ఆర్టీసికి సంక్రాంతి కీలకం కావడంతో రద్దీకి తగ్గట్టు బస్సులు నడపడంపై ఉన్నతాధికారులు కుస్తీ పడుతున్నారు. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలకు ఏపీఎస్ఆర్టీసీ 2,500 స్పెషల్ బస్సులు నడుపుతోంది. అందులో రద్దీ ఎక్కువగా ఉండే 11, 12 తేదీల్లోనే 1,095 బస్సులు నడపనుంది. హైటెక్ సిటీ నుంచి 50 ప్రత్యేక బస్సులు విజయవాడ, ఉభయగోదావరి జిల్లాల వైపు నడిపించనున్నారు. ఇక బీహెచ్ఈఎల్, మియాపూర్, కేపీహెచ్ బీ కాలనీ, అమీర్ పేట, ఎల్బీ నగర్, ఎంజీబీఎస్ నుంచి సొంతూళ్లకు వెళ్లేవాళ్లే ఎక్కువగా ఉన్నందున బస్సుల రాక గురించి ముందస్తు సమాచారం ఇవ్వనున్నారు.

ఇక రిజర్వేషన్ సదుపాయం ఉన్న దూరప్రాంత బస్సులకు ఇప్పటికే జీపీఎస్ ఉండగా.. ప్రత్యేక బస్సులకు కూడా ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. మనం వెళ్లాల్సిన బస్సు సర్వీస్ నంబర్ ను ఆర్టీసీ యాప్ లో ఎంటర్ చేస్తే బస్సు ఎక్కడుందనే సమాచారం తెలుసుకునేలా ఏర్పాటు చేశారు.

LEAVE A REPLY