నందమూరి బాలకృష్ణ సెంచరీ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి రిలీజ్ కు సిద్ధమైంది. ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లపై శాతకర్ణి దాడి జరగబోతోంది. ఇదే సమయంలో డైరెక్టర్ క్రిష్ మరో సంచలనానికి తెరలేపాడు. కేవలం 79 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న శాతకర్ణికి సీక్వెల్ కూడా తీయాలని భావిస్తున్నట్టు చెప్పాడు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శాతకర్ణి మూవీ గురించి ఎన్నో విషయాలు పంచుకున్నాడు. గౌతమిపుత్రశాతకర్ణిని సినిమాలా కాకుండా యజ్ఞంలా భావించి పూర్తి చేశామని చెప్పారు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్ పై దృష్టి పెట్టామని.. దీంతో పాటే సీక్వెల్ కూడా చేసే ఆలోచన ఉందని వెల్లడించారు.

శాతకర్ణి తనయుడు వశిష్టిపుత్ర పులమావి రాజ్యపాలన నేపథ్యంలో సీక్వెల్ తెరకెక్కుతుందని తెలిపారు. మిగతా వివరాలు తర్వాత వెల్లడిస్తామని చెప్పారు. అయితే క్రిష్ నిజంగానే శాతకర్ణి సీక్వెల్ తీస్తారా..? లేక మూవీ ప్రమోషన్ కోసం ఈ మాట చెప్పారా అన్నది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

LEAVE A REPLY