దివంగత ముఖ్యమంత్రి వైఎస్ 23 లక్షల మంది పేదలకు 31 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేస్తే.. చంద్రబాబు భూములు లాక్కుంటున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. కర్నూలు జిల్లాలో జరుగుతున్న రైతు భరోసా యాత్రలో భాగంగా జగన్ మహానంది మండలంలో సాగింది. అధికారిక లెక్కల ప్రకారమే జిల్లాలో 40 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడినా.. కేవలం నలుగురికి మాత్రము ఎక్స్ గ్రేషియా ఇచ్చారని మండిపడ్డారు. రైతులకు ఇవ్వాల్సిన ఇన్ పట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. కేబినెట్ సమావేశాల్లో రైతుల సమస్యలపై కాకుండా.. భూములు లాక్కునే అంశాలపైనే చర్చిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

LEAVE A REPLY