మెగాస్టార్ అదో పేరు కాదు.. ఓ బ్రాండ్.. తెలుగు సినీ ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ గేమ్ ఎన్నాళ్లు జరిగినా.. తన ఫ్లేస్ సేఫ్ గా ఉంచుకున్న లెజెండ్ యాక్టర్ చిరంజీవి. సుమారు పదేళ్ల తర్వాత మళ్లీ ముఖానికి మేకప్ వేసుకొని.. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ వస్తున్నాడు. ఈ నెల 11న సునామీలో ఖైదీ నంబర్ 150గా థియేటర్లను తాకబోతున్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున మూవీ రిలీజ్ కాబోతోంది. మెగా ఫ్యాన్స్ సంబరాలకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో మిగిలిన హీరోల ఫ్యాన్స్ కూడా nagమెగాస్టార్ కు విషెస్ చెబుతున్నారు. ఎప్పుడూ ఇద్దరు హీరోల అభిమానులు అనగానే వాదనలు, కామెంట్లు, ఒకరిని ఒకరు కించపరుచుకోవడాలే చూశాం. కానీ మెగా మూవీ కోసం అందరి అభిమానులు ఒక్కటవుతున్నారు. మెగాస్టార్ కు ఆల్ ది బెస్ట్ చెబుతూ కడప జిల్లాలో అక్కినేని ఫ్యాన్స్ బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే.. కృష్ణా జిల్లా గుడివాడలో ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్లెక్సీలు కట్టారు. అందరూ మెగాస్టార్ కు అభినందనలు తెలిపినవారే.

సంక్రాంతి రేసులో ఖైదీ నంబర్ 150, బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాల మధ్య గట్టి పోటీ నెలకొన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడా మెగాస్టార్ బాలయ్యబాబుతో పాటు శర్వానంద్ శతమానం భవతికి, నారాయణమూర్తి కానిస్టేబుల్ వెంకట్రామయ్య సినిమాలు కూడా హిట్ కావాలని కోరుకున్నారు. హీరోల మధ్య ఫ్రెండ్లీ పోటీ ఉంటుంది. కానీ ఫ్యాన్స్ మాత్రం హద్దులు మీరి ప్రవర్తించడం మనం చాలాసార్లు చూశాం. కానీ ఇప్పుడు కాలం మారింది, ఆలోచనలూ మారాయి. ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ఫ్యాన్స్ కూడా నవశకానికి నాంది పలుకుతున్నారు. ఇది మంచి పరిణామమేనని టాలీవుడ్ మొత్తం అభిమానులపై ప్రశంసల జల్లు కురిపిస్తోంది.

LEAVE A REPLY