Vigilance attacks on Duplicate medicines in kurnool

నకిలీ మందులు తయారు చేస్తున్న ఓ కేంద్రంపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. కర్నూల్ నగరంలోని శిల్పా టౌన్ షిప్ లో ఒక ఇంట్లో అక్రమంగా తయారు చేస్తున్న నకిలీ ఆయుర్వేదిక్ కేంద్రంపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి 5లక్షలు విలువ చేసే నకిలీ మందులను స్వాధీనం చేసుకున్నారు. టాబ్లెట్లలో ఉన్న కెమికల్ ను తీసుకుని ఆర్వెదిక్ మందులుగా చెలామణి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మందుల వరుసగా నెల రోజులు వాడితే రోగులకు కొత్తగా కిడ్నీ సమస్యలు  వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. వైద్యనాథ్ డయాబెటిక్ కేర్ అనే పేరుతో ఈ మందులను రెండు తెలుగు రాష్ట్రాల్లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు నిర్వాహకులు. విజిలెన్స్ అధికారులకు సమాచారం అందడంతో దాడులు నిర్వహించారు. నిర్వహకులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

LEAVE A REPLY