క్యారెట్ ఎంత పవర్ ఫుల్లో తెలుసా… యుద్ధ ఫలితాల్ని కూడ మార్చేస్తుందంట… రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్లను ధీటుగా ఎదుర్కొనేందుకు బ్రిటన్ ఒక చిట్కా పాటించందని చెబుతారు. సైనికుల ఆహారంలో క్యారెట్ తినడం తప్పనిసరి చేసిందంట. యుద్ధం చేసే సైనికుడికి ఆరోగ్యం, చురుకుదనంతో పాటు కంటిచూపు తీక్షణంగా ఉండాలి. అందుకు క్యారెట్ మేలు చేస్తుందని బ్రిటిష్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. యుద్ధవిమానాలు నడిపే సైనికులకి ప్రత్యేకంగా క్యారెట్లు కూడా సరఫరాచేసేసింది. అదీ క్యారెట్ మహత్యం.
కంటి చూపుకి క్యారెట్ మేలు చేస్తుందని తెలీని వారుండరు. కానీ ఎలా మేలు చేస్తుందనే సందేహం చాలామందికి ఉంటుంది. క్యారెట్ ని అడ్డంగా కొసినప్పుడు ఎప్పుడైనా గమనించారు. కంటి నల్ల గుడ్డు ఆకారంలో పొరలు పొరలుగా క్యారెట్ పొరలు కూడా కనిపిస్తాయి. క్యారెట్లో ఉండే బీటా కెరోటిన్ ‘కళ్లకి మేలు చేస్తుంది. ఎ’ విటమిన్ లోని రకంగా చెప్పుకునే బీటా కెరోటిన్ కళ్లని ఆరోగ్యం ఉంచడానికి దోహదం చేస్తుంది. దీనివల్ల కంటి నరాల్లో రక్త ప్రసరణ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. కార్నియాని కాపాడటానికి కూడా ఈ పిగ్మెంట్ ఉపయోగపడుతుంది. క్యారెట్ తో పాటు సిట్రస్ ఎక్కువగా ఉండే ఫలాలు, తోటకూర వంటి ఆకుకూరలు కంటికి బాగా మేలు చేసేవే…

LEAVE A REPLY