సుమారు పదేళ్ల విరామం. ఎంతోమంది ఎదురుచూపులు, రావాలంటూ డిమాండ్లు, వెండితెరపై మళ్లీ సత్తా చాటాలంటూ కోరికలు. అన్నింటికీ మించి.. రీ ఎంట్రీలో రికార్డులు బద్దలు కొట్టాలన్న ఆరాటం. అన్నీ తీరే రోజు వచ్చేసింది. మెగాస్టార్ 150వ సినిమా ఖైదీ నంబర్ 150 రిలీజైంది. మరి అభిమానుల అంచనాలు ఖైదీ అందుకున్నాడా..? రికార్డుల రారాజు మరో రికార్డు సృష్టిస్తాడా..? అన్నది తెలియాలంటే.. మెగా మూవీపై రివ్యూ చూడాల్సింది.

తొమ్మిదేళ్ల తర్వాత బాస్ ఈజ్ బ్యాక్ అంటే మెగాస్టార్ వెండితెరపై ప్రత్యక్షమయ్యాడు. 150వ సినిమా కావడం.. అందులోనూ రామ్ చరణ్ నిర్మాతగా మారిన తొలిసినిమా. వీటితో పాటు సంక్రాంతి బరిలో దిగిన మెగా మూవీ. తమిళ చిత్రం కత్తి రీమేక్ గా తెరకెక్కిన ఖైదీ నంబర్ 150కి ఎన్ని మార్కులు పడ్డాయో చూడండి.

కథ అందరికీ ముందే తెలిసిందే. రైతుల పక్షాన నిలిచి.. కార్పొరేట్ శక్తులతో పోరాడే వ్యక్తి కథే ఖౌదీ నంబర్ 150. కోల్ కతా సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్న కత్తి శీను (చిరంజీవి) హైదరాబాద్ వస్తాడు. అక్కడ కాజల్ ను చూసి ప్రేమలో పడిపోయి ఫారిన్ వెళ్లకుండా ఆగిపోతాడు. అదే సమయంలో కత్తి శీనులా ఉన్న శంకర్ (చిరంజీవి)పై హత్యాయత్నం జరగడం.. అదే సమయంలో అతను అక్కడే ఉండడంతో కథ ఆసక్తికరంగా మారుతుంది. తనలా ఉన్న శంకర్ ను కాపాడిన కత్తిశీను ఆస్పత్రిలో చేరుస్తాడు. ఫారిన్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో కత్తి శీనును శంకర్ లా భావించిన కలెక్టర్.. అతడ్ని రైతులున్న వృద్ధాశ్రమానికి తీసుకొస్తాడు. కానీ అనుకోని పరిణామాల మధ్య శంకర్ గొప్పదనం తెలుసుకున్న కత్తి శీను.. వాళ్ల కోసం ఏం చేశాడు..? అగర్వాల్ అరాచకాలను ఎలా అడ్డుకున్నాడు..? అన్నదే మిగిలిన కథ.

రీమేక్ అయినా.. పక్కా కమర్షియల్ సినిమాలా తెరకెక్కించాడు వివి వినాయ్క్. ఓ వైపు కామెడీని పండిస్తూనే మెసేజ్ అందించాడు. కత్తి శీను పాత్రలో మలుపులు, విలన్ తో యుద్ధం వంటి వాటిని ఆసక్తికరంగా మలిచాడు.  ఓ పక్క కథనం వేగంగా సాగుతుండగానే.. పాటలు, రైతుల దీన స్థితి. కామెడీ పంచ్ లు వరుసగా వచ్చేస్తాయి. మెగాస్టార్ రేంజ్ తగ్గట్టుగానే పాటలు, ఫైట్స్ బాగున్నాయి.

ఇక తోమ్మిదేళ్ల తర్వాత మేకప్ వేసుకున్న మెగాస్టార్ మునపటిలానే రెండు పాత్రలను పండించారు. డ్యాన్సుల్లోనూ ఒకప్పటి హుషారు చూపించారు. మెగాస్టార్ పక్కన కాజల్ అందంగా కనిపించింది.  దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్, రత్నవేలు ఫొటోగ్రఫీ బాగున్నాయి. బ్రహ్మానందం, పోసాని, జయప్రకాష్ రెడ్డి.. వాళ్ల పాత్రల పరిధిలో నటించారు. విలన్ బలహీనం కావడం కొంచెం మైనస్ లా కనిపించినా.. సినిమా అంతా మెగాస్టార్ పైనే సాగడంతో ఆ లోటు తెలియదు.. ఓవరాల్ గా అభిమానులకు నిజమైన సంక్రాంతి తెచ్చిన సినిమా అని చెప్పొచ్చు.

LEAVE A REPLY