తమిళ రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే కార్యకర్తల నుంచి సామాన్యుల వరకు ఆమె నెచ్చెలి శశికళపై మండిపడుతున్న విషయం తెలిసిందే. కనీసం జయ కుటుంబ సభ్యుల్ని కూడా చూడనీయకుండా శశికళ వ్యవహార శైలి అనుమానాస్పదంగా మారిందనే విమర్శలు రేగుతున్నాయి. వీటికి తోడు జయ మేనకోడలి బహిరంగ ప్రకటనలకు క్రమంగా మద్దతు పెరుగుతోంది. రేపోమాపో ఆమె కొత్త పార్టీ పెట్టినా ఆశ్చర్యంలేదనే వారూ ఉన్నారు.
విచిత్రంగా శశికళ సొంత జిల్లాలో కూడా దీపకు మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే జయ నియోజకవర్గం ఆర్కేనగర్ లో పోటీ చేస్తే పరాభవం తప్పదని తేలిపోయింది. సొంత జిల్లాలోనూ వ్యతరేకత పెరగడం శశి వర్గంలో గుబులు రేపుతోంది. శశికళకు బద్దతుగా పెట్టిన బ్యానర్లపై పేడముద్దలు కొడుతున్నారు. అంతేకాదు దీపకు మద్దతు ఓ సంఘం కూడా ఆవిర్భవించింది. దీపా పేరవై పేరుతో వెలిసిన ఈ సంఘానికి కార్యవర్గాన్ని నియమించేందుకు జోరుగా సమాలోచనలు జరుగుతున్నాయి. అయితే నేరుగా శశికళపై ఎలాంటి విమర్శలు చేయకుండా ప్రజామద్దతు కూడగట్టుకోవాలని దీప సూచించినట్టు సమాచారం. కానీ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నవారందరూ ప్రజా మద్దతుతో ఆస్థానానికి ఎదిగిన వారు. శశికళ మాత్రం జయలలితతో ఉన్న సాన్నిహిత్యాన్ని వాడుకొని అధికారం దక్కించుకోవాలని కుట్రలు పన్నుతున్నట్టు దీప అభిమానులు బహిరంగంగానే ధ్వజమెత్తుతున్నారు. ఈ పరిణామాలతో కలతచెందుతున్న కొందరు అన్నాడిఎంకే నేతలు దీపకు మద్దతు తమ పార్టీ ఉందని చెప్పే ప్రయత్నం చేస్తుండటం గమనార్హం…

LEAVE A REPLY